Pages

Thursday, December 18, 2014

నరసింహ అవతారం ఎత్తకుంటే నడిచేలా లేదు: సీఎం


హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వాధికారులు పాల్గొనాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. అధికారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇవాళ మెదక్ జిల్లా నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలోని ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు.ఈ పథకం విజయవంతం కావడానికి తాను నరసింహావతారం ఎత్తకుంటే నడిచేలా లేదన్నారు. ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పేర్కొన్నారు. ఈ పథకం విజయవంతం కావడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అధికారులు ఉద్యమంలో పాల్గొన్నట్టే తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా పాలు పంచుకోవాలని కోరారు. తెలంగాణలో మంచినీటి కోసం మహిళ బజార్‌లో నిలబడి కనిపించకూడదని అన్నారు. ఏ ఊళ్లో మంచినీళ్ల కోసం మహిళ రోడ్డెక్కితే ఆ ఊరు సర్పంచ్, ఎంపీటీసీ రాజీనామా చేయాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు. అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని సూచనప్రాయంగా తెలిపారు.

గ్రామాల్లో మట్టి రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవాల్సిన అవసరంలేదని సీఎం అధికారులకు సూచించారు. గ్రామాలన్నింటికి త్వరలో తారు రోడ్లు వేయించుతామని పేర్కొన్నారు. తలుచుకుంటే రాబోయే మూడేళ్లలో ఎన్నో అద్బుతాలు చేసి చూపించొచ్చని తెలిపారు.

No comments:

Post a Comment