Pages

Thursday, December 18, 2014

మంజీరా నదిపై మరో ఐదారు చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి: కేసీఆర్‌



మంజీరా నదిపై మరో ఐదారు చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి: కేసీఆర్‌
హైదరాబాద్‌: మంజీరా నదిపై మరో ఐదారు చెక్‌డ్యాములు నిర్మిస్తే బాగుంటుందని, కొల్చారంలో అంగుళం భూమి మునగకుండా ఘన్‌పూర్‌ ఆయకట్టు అభివృద్ధిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మెదక్‌ పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ జిల్లాలో అటవీభూమి ఉంది కానీ చెట్లు లేవని, మొక్కలు పెంచకుంటే భవిష్యత్‌ తరాలకు నష్టం చేసినవాళ్లమవుతామని అన్నారు. తెలంగాణ హరితవనం కావాలని, వర్షాలు తిరిగి రావాలని సీఎం ఆకాంక్షించారు. జలజాలం పని పూర్తయ్యాక ఏ ఆడబిడ్డా బిందెతో నీటికోసం బయటకు వెళ్లకూడదన్నారు. అలా జరిగితే ఆ వూరి సర్పంచ్‌, ఎంపీటీసీలు రాజీనామా చేయాలన్నారు. నాలుగేళ్లలో ఇంటింటికీ నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమన్నారు. తెలంగాణను గుంతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. హైదరాబాద్‌లో కొంతభూమి అమ్మితే రూ. 25 వేల కోట్లు వస్తాయని, వనరులకు కొదవ లేదని, జిల్లాలకు పట్టిన దరిద్రం వదిలిపోవాలని ఆయన అన్నారు

No comments:

Post a Comment