Pages

Monday, January 12, 2015

Mission Kakatiya Updates


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చెరువుల పునరుద్దరణ – మిషన్ కాకతీయకు వివిధ వర్గాల నుండి అపూర్వ స్పందన వ్యక్తం లభిస్తోంది. అమెరికా , ఇంగ్లండ్ , ఆస్ట్రేలియా దేశాల నుండి తెలంగాణ ప్రవాస భారతీయులు సాగునీటి మంత్రి శ్రీ హరీశ్ రావు గారు వారికి రాసిన లేఖకు స్పందిస్తూ ఈమెయిళ్ళు, ఫోన్ ద్వారా తమ మద్దత్తును తమ సహాకారాన్ని అందిస్తామని ప్రకటిస్తున్నారు. వారిలో మరి కొందరు మంత్రి హరీశ్ రావు గారితో చర్చించి తమ సూచనలను తెలియజేశారు. జనవరి 5 న తెలంగాన డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో మంత్రిని కలసి మిషన్ కాకతీయకు తమ సంపూర్ణ సహకారాన్ని ప్రకటించారు. తమ ఊరి చెరువును బాగు చేసుకోవడానికి ఇదొక గొప్ప , అవకాశమని , రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అధ్భుత కార్యక్రమాన్ని తీసుకోవడం గ్రామీణ వికాసానికి దోహదపడుతుందని కొనియాడారు.

అమెరికాలోని పేరు పొందిన మిచిగాన్ యూనివర్సిటి మిషన్ కాకతీయ పై పరిషోదనకు గాను 50 000 ల డాలర్లను మంజూరు చేసింది. వివిధ దేశాలకు చెందిన ఏడుగురు పరిశోధక విద్యార్తులు కరీంనగర్ జిల్ల కు చెందిన ఆదిత్య నాయకత్వంలో రాష్ట్రానికి వచ్చిప్రాథమిక అధ్యయనం చేసి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావును అమెరికా వచ్చి తమ యూనివర్సిటీలో చెరువుల పునరుద్దరణ కార్యక్రమంపై ప్రసంగించాలని ఆహ్వానించినారు.


Persons who have expressed to adopt a tank in Mission kakatiya program


 1. Sri . Vijay Chavva , Founder Chairman , Telangana Cultural Association , USA Expressed willingness to adopt some villages in Mahaboobnagar district through email.
2. Sri . B.V.Rao , Founder President , Telangana Developement Forum , USA Expressed willingness to adopt Kancherla village Cheruvu , Yellareddypet (M) , Karimnagar Dist. Through email
3. Sri T.Ramachandra Reddy , Particulars not known. He wants to sponsor tank in Nandi Vaddeman , Bijinepalli ( M) , Mahaboobnagar Dist. through email
4. Sri. Ravula Ranga Reddy , Ex Serviceman , Devakkapata , Bejjanki (M) , karimanagar Dist. He wants to bear transportation expenditures of silt to the fields excavated from two kuntas in Devakkapata through a letter addressed to Hon ble Minister
5. Sri Ravichander , CEO ,Exceed Management Pvt Ltd , USA. He wants to donate 10 lakh rupees to the Mission Kakatiya Fund on phone
6. Sri.Anil Kumar, UK , TRS NRIs cell President contacted and expressed willingness to adopt tanks on phone
7. Sri. Nagender , UK contacted and expressed willingness to adopt a tank of his village on phone
8. Sri Bal Reddy , Industrialist , Raipole (V), Doulatabad (M) , Medak Dist . Issued a press statement that he will adopt his village tank for restoration.
9. Sri. Mainampati Ramanuja Reddy , Mainampati Murahari Reddy, Mainampati Muralidhar Reddy , Three brothers who live in Atlanta , USA issued a press statement that they would like to adopt Pai Cheruvu of Ramapuram (V) , Garla ( M) , Khammam dist.
10. Sri Ravinder Rao ,Owner of a Granite Industry contacted and expressed willingness to adopt a tank in his village on phone.
11. Terlangana Builders Association expressed willingness to adopt some tanks in 10 districts
12. Solipuram Ram Reddy , Telangana Industrialist , expressed willingness to adopt a tank in Mandapuram village , valigonda (M) , Nalgonda dist. through a press statements
13. Sri . Anil Goud , Melbourn Australia. He has expressed willingness to adopt his village tank
14. Sri.Boyinapalli Prabhakara Rao , Ex service man ,Totapalli ( V) , Bejjanki (M) ,Karimnagar Dist, He has come forward to transport silt excavated from Totapalli tank to the fields
15. Sri.Ravi Mohan , Dallas has contacted and expressed willingness to adopt Thimmapurtank in Medak ( M)
16. Sri. Prakash Reddy , Advocate , expressed willingness to adopt his village tank , Amarachinta cheruvu , Maktal (M) , Mahaboobnagar dist.
17. Ponnala Srinivas has expressed his willingness through email to adopt Tekulapalli Cheruvu , Yellareddipet (M) , Karimanagar dist.
18. On Jan 5 a meeting was held with NRIs of Telangana. The following members have participated and expressed their interest in Mission Kakatiya Program and expressed that they would cooperate in mobilizing teh funds for the restoration of tanks
I. Sri Harinath Medi
II. D.P Reddy
III. Srinivas Ponnaala ( Already mentioned at Sl no 18 )
IV. Dr . Janardhan Bollu
V. P. Subhash C Reddy
VI. Balakishan Rao Patlori
VII. Jagadeesh Bondugula
VIII. Devaiah Pagidipati
IX. Rajith Akula
X. B.V Rao ( Alreadu mentioned at Sl No 2.
19.Swami Reddy and other Telangana Electricity Engineers Association have resolved to adopt a tank - Erra Cheruvu in Machapur village by donating one day salary
20. TNGOs have expressed their eillingness to spare one day in all the district in tank restoration program as token of their participation and total cooperation

Sunday, January 11, 2015

Tenders for Mission Kakatiya project by Jan 25: T. Harish Rao


 Hyderabad, Jan 10, 2015: Irrigation Minister T Harish Rao on Saturday informed that tenders for at least 50 per cent of the tanks to be revived under Mission Kakatiya project would be called by January 25.
Speaking to media persons here after holding a video-conference with District Collectors at the State Secretariat here, Harish Rao said that the State Government has expedited the process of calling the tenders so as to complete the project as scheduled. He said massive awareness campaign would be launched across the State by involving schools and Gram Sabhas. He said that the government aims to take up revival of 9,300 tanks this year.
The minister also sought Central assistance for the Mission Kakatiya. Further, he said huge funds were due to the State under various Central schemes. He said that the NABARD has been urged to grant Rs 1,000 crore loan for Mission Kakatiya scheme.

Saturday, January 10, 2015

కాకతీయమిషన్ పై హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : సచివాలయంలో కాకతీయ మిషన్ పై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావువీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, డీఈలు, ఈఈలతో మంత్రి మాట్లాడారు. మొదటి దశలో ఆరు జిల్లాల్లో 200 చెరువులపైగా పునరుద్ధరించనున్నారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Thursday, January 8, 2015

Mission Kakatiya Updates







నాలుగేళ్లలో వాటర్ గ్రిడ్ - భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

-ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్...
-నీళ్లివ్వకపోతే ఓట్లడగం...
-ఇక్కడ ఇండ్రస్టీ పెట్టేవాళ్లే దేవుళ్లు
-వారికి అన్ని రకాలుగా సహకరిస్తాం
-చెరువుల పునరుద్ధరణలో విద్యార్థులు పాల్గొనాలి
-భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 


నర్సాపూర్/వెల్దుర్తి, జనవరి 7 (టీ మీడియా) : వచ్చే నాలుగేళ్లలో తెలంగాణ ప్రాంతంలోని మారుమూల గ్రామంలోని ప్రతి తాండాకు. ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు తాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. దేశంలోని ఏరాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఇంటికి నల్లాకనెక్షన్ ఇవ్వడం కోసం వాటర్‌గ్రిడ్ పథకం ప్రవేశపెట్టారని రాష్ట్రభారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నర్సాపూర్ సమీపంలోని పద్మశ్రీ బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన తెలంగాణ సంస్కృతి సంప్రదాయ దినోత్సవానికి హరీశ్‌రావు, జడ్పీచైర్ పర్సన్ రాజమణి మురళీయాదవ్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రతి ఇంటికీ నల్లాకనెక్షన్ ఇస్తే దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ అవుతుందని, నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ పథకం కింద తాగునీరు తాగించకపోతే వచ్చే ఎన్నికల్లో తాము ప్రజలను ఓట్లు అడగమని తేల్చిచెప్పారు.

తెలంగాణ ప్రాంతం లో ఇండస్ట్ట్రీలు పెట్టిన వాళ్లే మాకు దేవుళ్లని వారికి ప్రభుత్వం రెడ్‌కార్పేట్ పరిచి స్వాగతం పలికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన మిషన్‌కాకతీయ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని మిషన్‌కాకతీయ అంటే గత కాకతీయ రెడ్డిరాజుల పాలనలో పెద్దఎత్తున చెరువులు తవ్వించడం జరిగిందని అవి 60సంవత్సరాలుగా పునరుద్ధరణకు నోచుకోలేనందున ఈ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణను ఒక ఉద్యమంలా చేపట్ట డం జరిగిందని దీనికి మిషన్‌కాకతీయ అనే పేరుపెట్టినట్లు తెలిపారు. విద్యార్థులు చెరువుల పునరుద్ధరణలో పాల్గొంటే ప్రాక్టికల్‌గా అవగాహన వస్తుందని తెలిపారు. నర్సాపూర్ ప్రాంతంలో చాలా చెరువులు ఉన్నాయని ప్రతి విద్యార్థి చెరువు పునరుద్ధరణలో పాల్గొనాలని సూచించారు. హైదరాబాద్‌కు ఇంత దూరం లో బీవీఆర్‌ఐటీ ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉత్తమ కళాశాలగా పేరుగాంచిందని అన్నారు.

201 చెరువుల పునరుద్ధరణకు 67 కోట్లు

-మిషన్ కాకతీయకు జీవోలు
హైదరాబాద్, జనవరి 7 (టీ మీడియా):మిషన్ కాకతీయలో భాగంగా నాలుగు జిల్లాల్లో 201 చెరువులకు పరిపాలన అనుమతులు మంజూరుచేస్తూ బుధవారం రెండు జీవోలు జారీ అయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో 93 చెరువుల పునరుద్ధరణకోసం రూ.30.98 కోట్లు, మెదక్, రంగారెడ్డి జిల్లాలో 108 చెరువుల పునరుద్ధరణకోసం రూ.36.14కోట్లు మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

కృష్ణా-గోదావరి బేసిన్‌లో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన నీటి వనరులను పునరుద్ధరించేందకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. చిన్ననీటిపారుదల శాఖ పరిధిలో గతంలో ఉండాల్సిన 250 టీఎంసీలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది.

tab

Wednesday, January 7, 2015

ఆంధ్రను కట్టడి చేయండి - నదుల అనుసంధానంపై సదస్సులో హరీశ్


-ఏపీ తీరుతో తెలంగాణకు తీరని అన్యాయం
-ఇప్పటికే వాటాకు మించి వాడుకున్నారు
-కృష్ణా జలాల విషయంలో ఉమాభారతికి హరీశ్ ఫిర్యాదు
-తెలంగాణకు అన్యాయం జరిగితే ఒప్పుకోం
-నదుల అనుసంధానంపై సదస్సులో హరీశ్


కృష్ణానదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తనకు కేటాయించిన నీటికంటే అదనంగానే వాడుకున్నదని, అయినా మళ్లీ కృష్ణాజలాలపై రాద్ధాంతం చేస్తున్నదని కేంద్రమంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు.

నదుల అనుసంధానంపై కేంద్ర జల వనరుల శాఖ మంగళవారం ఏర్పాటుచేసిన అన్ని రాష్ర్టాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమాభారతితో ఆయన విడిగా సమావేశమై.. కృష్ణాజలాలపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా కృష్ణాజలాలపై తమ వాదనతో కూడిన వినతిపత్రాలను కేంద్ర మంత్రికి సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తనకు కేటాయించిన వాటాకంటే 11 టీఎంసీల నీటిని ఎక్కువగా వాడుకున్నదని, తెలంగాణ రాష్ట్రం ఇంకా 112 టీఎంసీల నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నదని కేంద్ర మంత్రికి హరీశ్‌రావు స్పష్టంచేశారు. తమకు అన్యాయం చేసే తీరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఉల్లంఘనకు పాల్పడుతున్నదని ఆమెకు వివరించారు.

Tuesday, January 6, 2015

Mission Kakatiya Updates


మిషన్‌ కాకతీయ పైలాన్‌ నమూనాను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు ఖరారు చేశారు. మిషన్‌ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి గుర్తుగా ఈ పైలాన్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేస్తారు.

నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్‌రావు పర్యవేక్షణలో ఆ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు పైలాన్‌ రూపకల్పన చేశారు. ముఖ్యమంత్రి ఈ నమూనాకు ఆమోదం తెలిపారు. తెలంగాణలోని దాదాపు 46 వేల చెరువులను పునరుద్దరించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇందులో భాగంగా మొదటి ఏడాది 9 వేల చెరువులను పునరుద్దరిస్తుంది. జనవరి మూడవ వారంలో ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో 20 అడుగుల ఈ పైలాన్‌ను ఆవిష్కరింపజేసి మిషన్‌ కాకతీయను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణలో వేలాది చెరువులు తవ్వించి ఆదర్శంగా నిలిచిన కాకతీయులను స్పూర్తిగా తీసుకుని ప్రభుత్వం మిషన్‌ కాకతీయ చేపట్టింది. వరంగల్‌ రాజధానిగా కాకతీయుల రాజ్యం ఉండడంతో పాటు, లక్నవరం, పాకాల, రామప్ప, ఘనపురం, ధర్మసాగరం లాంటి పెద్ద చెరువులు వరంగల్‌ జిల్లాలోనే ఉన్నందున జిల్లా కేంద్రంలోనే పైలాన్‌ ఏర్పాటు చేయడం సముచితంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసిఆర్‌ భావిస్తున్నారు.

చెరువుల అభివృద్ధికి చర్యలు - భారి నీటి పారుదల శాక మంత్రి హరీశ్‌ రావు


 -పటాన్‌చెరు సాకిచెరువుకు రూ. 5. 50 కోట్లు
-మురుగునీరు చెరువులోకి రాకుండా రూ. 10 కోట్లతో ఓపెన్‌డ్రైన్
-జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం
-కార్యకర్తలను పార్టీ కాపాడుకుంటుంది
-పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు
-త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
-భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు


జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల అభివృద్ధి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం పటాన్‌చెరులోని సాకిచెరువు, తిమ్మక్ చెరువులను పరిశీలించి వాటి సుందరీకరణకు నిధులను ప్రకటించారు. అనంతరం పాటి గ్రామంలోని ఎస్‌వీఆర్ గార్డెన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పేదల ఎజెండాయే టీఆర్‌ఎస్ ఎజెండా... జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలను పార్టీ కాపాడుకుంటుందని.. వారికి పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కార్యకర్తలు మరింత హుషారుగా పనిచేసి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

పటాన్‌చెరు రూరల్, జనవరి 5 (టీ మీడియా) : పేదల ఎజెండాయే టీఆర్‌ఎస్ ఎజెండా అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం పటాన్‌చెరు మండలం పాటి గ్రామంలోని ఎస్‌వీఆర్ గార్డెన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో చేసిన వాగ్దానాలతో పాటు చెప్పని విషయాలను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు షబ్బిర్ అలీ టీఆర్‌ఎస్ మీద నిందలు వేయడం సరికాదన్నారు.


2009లో రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తామని కనీసం 7గంటల విద్యుత్‌ను కూడా ఇవ్వలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు 17వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, 22వేల 500వందల కోట్లతో చెరువులను బాగుచేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తామని లేదంటే వచ్చే ఐదేళ్ల ఎన్నికల్లో ఓట్లకోసం రామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ ఆడపడుచుల కష్టాలను చూసి పేకాట క్లబ్‌లను మూయించారన్నారు. ఆటో డ్రైవర్ల ట్యాక్స్‌ను తొలగించారని, ట్రాక్టర్‌లపై పన్నును రద్దు చేశామని తెలిపారు. ఆహార భద్రత కార్డుల ద్వారా అర్హులందరికీ బియ్యం అందజేస్తామన్నారు. 200రూపాయలున్న పింఛన్లను 1000 రూపాయ లు చేసిన ఘనత తమదేనన్నారు. రాష్ట్రంలో 26లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం మెదక్‌జిల్లాలోనే 2లక్షల 90వేల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు.