Pages

Tuesday, January 6, 2015

Mission Kakatiya Updates


మిషన్‌ కాకతీయ పైలాన్‌ నమూనాను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు ఖరారు చేశారు. మిషన్‌ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి గుర్తుగా ఈ పైలాన్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేస్తారు.

నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్‌రావు పర్యవేక్షణలో ఆ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు పైలాన్‌ రూపకల్పన చేశారు. ముఖ్యమంత్రి ఈ నమూనాకు ఆమోదం తెలిపారు. తెలంగాణలోని దాదాపు 46 వేల చెరువులను పునరుద్దరించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇందులో భాగంగా మొదటి ఏడాది 9 వేల చెరువులను పునరుద్దరిస్తుంది. జనవరి మూడవ వారంలో ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో 20 అడుగుల ఈ పైలాన్‌ను ఆవిష్కరింపజేసి మిషన్‌ కాకతీయను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణలో వేలాది చెరువులు తవ్వించి ఆదర్శంగా నిలిచిన కాకతీయులను స్పూర్తిగా తీసుకుని ప్రభుత్వం మిషన్‌ కాకతీయ చేపట్టింది. వరంగల్‌ రాజధానిగా కాకతీయుల రాజ్యం ఉండడంతో పాటు, లక్నవరం, పాకాల, రామప్ప, ఘనపురం, ధర్మసాగరం లాంటి పెద్ద చెరువులు వరంగల్‌ జిల్లాలోనే ఉన్నందున జిల్లా కేంద్రంలోనే పైలాన్‌ ఏర్పాటు చేయడం సముచితంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసిఆర్‌ భావిస్తున్నారు.

No comments:

Post a Comment