రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చెరువుల పునరుద్దరణ – మిషన్ కాకతీయకు వివిధ వర్గాల నుండి అపూర్వ స్పందన వ్యక్తం లభిస్తోంది. అమెరికా , ఇంగ్లండ్ , ఆస్ట్రేలియా దేశాల నుండి తెలంగాణ ప్రవాస భారతీయులు సాగునీటి మంత్రి శ్రీ హరీశ్ రావు గారు వారికి రాసిన లేఖకు స్పందిస్తూ ఈమెయిళ్ళు, ఫోన్ ద్వారా తమ మద్దత్తును తమ సహాకారాన్ని అందిస్తామని ప్రకటిస్తున్నారు. వారిలో మరి కొందరు మంత్రి హరీశ్ రావు గారితో చర్చించి తమ సూచనలను తెలియజేశారు. జనవరి 5 న తెలంగాన డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో మంత్రిని కలసి మిషన్ కాకతీయకు తమ సంపూర్ణ సహకారాన్ని ప్రకటించారు. తమ ఊరి చెరువును బాగు చేసుకోవడానికి ఇదొక గొప్ప , అవకాశమని , రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అధ్భుత కార్యక్రమాన్ని తీసుకోవడం గ్రామీణ వికాసానికి దోహదపడుతుందని కొనియాడారు.
అమెరికాలోని పేరు పొందిన మిచిగాన్ యూనివర్సిటి మిషన్ కాకతీయ పై పరిషోదనకు గాను 50 000 ల డాలర్లను మంజూరు చేసింది. వివిధ దేశాలకు చెందిన ఏడుగురు పరిశోధక విద్యార్తులు కరీంనగర్ జిల్ల కు చెందిన ఆదిత్య నాయకత్వంలో రాష్ట్రానికి వచ్చిప్రాథమిక అధ్యయనం చేసి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావును అమెరికా వచ్చి తమ యూనివర్సిటీలో చెరువుల పునరుద్దరణ కార్యక్రమంపై ప్రసంగించాలని ఆహ్వానించినారు.
No comments:
Post a Comment