Pages

Tuesday, January 6, 2015

చెరువుల అభివృద్ధికి చర్యలు - భారి నీటి పారుదల శాక మంత్రి హరీశ్‌ రావు


 -పటాన్‌చెరు సాకిచెరువుకు రూ. 5. 50 కోట్లు
-మురుగునీరు చెరువులోకి రాకుండా రూ. 10 కోట్లతో ఓపెన్‌డ్రైన్
-జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం
-కార్యకర్తలను పార్టీ కాపాడుకుంటుంది
-పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు
-త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
-భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు


జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల అభివృద్ధి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం పటాన్‌చెరులోని సాకిచెరువు, తిమ్మక్ చెరువులను పరిశీలించి వాటి సుందరీకరణకు నిధులను ప్రకటించారు. అనంతరం పాటి గ్రామంలోని ఎస్‌వీఆర్ గార్డెన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పేదల ఎజెండాయే టీఆర్‌ఎస్ ఎజెండా... జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలను పార్టీ కాపాడుకుంటుందని.. వారికి పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కార్యకర్తలు మరింత హుషారుగా పనిచేసి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

పటాన్‌చెరు రూరల్, జనవరి 5 (టీ మీడియా) : పేదల ఎజెండాయే టీఆర్‌ఎస్ ఎజెండా అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం పటాన్‌చెరు మండలం పాటి గ్రామంలోని ఎస్‌వీఆర్ గార్డెన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో చేసిన వాగ్దానాలతో పాటు చెప్పని విషయాలను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు షబ్బిర్ అలీ టీఆర్‌ఎస్ మీద నిందలు వేయడం సరికాదన్నారు.


2009లో రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తామని కనీసం 7గంటల విద్యుత్‌ను కూడా ఇవ్వలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు 17వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, 22వేల 500వందల కోట్లతో చెరువులను బాగుచేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తామని లేదంటే వచ్చే ఐదేళ్ల ఎన్నికల్లో ఓట్లకోసం రామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ ఆడపడుచుల కష్టాలను చూసి పేకాట క్లబ్‌లను మూయించారన్నారు. ఆటో డ్రైవర్ల ట్యాక్స్‌ను తొలగించారని, ట్రాక్టర్‌లపై పన్నును రద్దు చేశామని తెలిపారు. ఆహార భద్రత కార్డుల ద్వారా అర్హులందరికీ బియ్యం అందజేస్తామన్నారు. 200రూపాయలున్న పింఛన్లను 1000 రూపాయ లు చేసిన ఘనత తమదేనన్నారు. రాష్ట్రంలో 26లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం మెదక్‌జిల్లాలోనే 2లక్షల 90వేల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు.


ఆహారభద్రత కార్డులు కూడా దాదాపు 1లక్షా 2వేల కార్డులు జిల్లాలో అదనంగా ఇచ్చామని స్పష్టం చేశారు. ఒక్క పేదవాడు కూడా ఆహారభద్రత కార్డులు లేకుండా మిగలరాదని కోరుకుంటున్నామన్నారు. విజయడైరీలో పాలు అమ్మే రైతన్నకు 4రూపాయలు అదనంగా లీటర్‌కు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. నిరుపేదలు కబ్జాల్లో ఉంటే 125గజాల దాక రెగ్యులరైజ్ చేస్తున్నామని అన్నారు. దశాబ్దాలుగా అలాంటి వారిని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెలంగాణలోని అన్ని చెరువులను బాగు చేసి తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామన్నారు. తమ సర్కా రు రైతు సర్కార్ అని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో ఆడపడుచుల పెళ్లీల్లకు 51వేల రూపాయలు తెలంగాణ సర్కారు ఇస్తుందని కార్యకర్తలు గ్రామల్లో ఆ పథకం అమలయ్యేలా చూడాలన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో రాయసముద్రం, తిమ్మక్క చెరువు, సాకి చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా చేస్తామన్నారు.

కార్యకర్తలకు ఆదుకుంటాం...
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎప్పుడు అండగా ఉండి ఎన్నో త్యాగాలు చేసిన టీఆర్‌ఎస్ శ్రేణులను కాపాడుకుంటామన్నారు. పార్టీ పదవులతో పాటు నామినేటడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీ, గ్రంథాలయ కమిటీల్లో చోటు కల్పిస్తామని హామినిచ్చారు. కార్యకర్తలు చురుకుగా పనిచేసి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్‌లో గులాబీజెండా ఎగురాలని అన్నారు. ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ పార్టీ వార్షికోత్సవం అత్యంత ఘనంగ జరుపుతామని తెలిపారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే కేవలం 6నెలల్లోనే రోడ్లకోసమే 91కోట్లు తీసుకువచ్చారన్నారు. మహిపాల్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికీ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆశిస్సులతో పటాన్‌చెరు నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుంటుందన్నారు.

ఇప్పటికే 120కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పటాన్‌చెరులో ప్రారంభం అయ్యాయన్నారు. త్వరలో పటాన్‌చెరులో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి భారీగా నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు ఇవ్వలన్నారు. జిల్లా చైర్‌పర్సన్ రాజమణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణను అన్ని రంగాల్లోఅభివృద్ధి చేయడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కార్యకర్తలకు అన్ని రకాలుగ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, నాయకులు చాగండ్ల నరేంద్రనాథ్, పార్టీ నియెజకవర్గ ఇన్‌చార్జి గాలీ అనీల్ కుమార్, యువత నాయకులు వెంకటేశ్‌గౌడ్, గౌరిశంకర్‌గౌడ్, గటాటి భద్రప్ప, అమ్మన్నగారి శేకర్, ఆర్‌సీపురం నాయకులు పుష్ప, కోలన్‌బాల్‌రెడ్డి, చంద్రారెడ్డి, నాగేశ్‌యాదవ్, ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, రవీందర్‌రెడ్డి, యాదగిరియాదవ్, సర్పంచులు బురిగారి విజయలక్ష్మీ, నవసుకుమారి, శాంతయ్య, బుద్దే ప్రభు,కంజర్ల క్రిష్ణ, అనసూయ, ప్రమీల, ఎంపీటీసీలు, నాయకులు శ్రీధర్‌చారి, గడీల కుమార్‌గౌడ్, పాం డురంగారెడ్డి, బాల్‌రాజ్, యూనుస్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.








No comments:

Post a Comment