Pages

Thursday, January 8, 2015

201 చెరువుల పునరుద్ధరణకు 67 కోట్లు

-మిషన్ కాకతీయకు జీవోలు
హైదరాబాద్, జనవరి 7 (టీ మీడియా):మిషన్ కాకతీయలో భాగంగా నాలుగు జిల్లాల్లో 201 చెరువులకు పరిపాలన అనుమతులు మంజూరుచేస్తూ బుధవారం రెండు జీవోలు జారీ అయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో 93 చెరువుల పునరుద్ధరణకోసం రూ.30.98 కోట్లు, మెదక్, రంగారెడ్డి జిల్లాలో 108 చెరువుల పునరుద్ధరణకోసం రూ.36.14కోట్లు మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

కృష్ణా-గోదావరి బేసిన్‌లో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన నీటి వనరులను పునరుద్ధరించేందకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. చిన్ననీటిపారుదల శాఖ పరిధిలో గతంలో ఉండాల్సిన 250 టీఎంసీలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది.

tab


కరీంనగర్ జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, కరీంనగర్, రామగుండం, తిమ్మాపూర్, బెజ్జంకి, హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లోని 12 చెరువులు, ఆదిలాబాద్ జిల్లాలోని రెబ్బెన, తిర్యాని, జైపూర్, మందమర్రి, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట్, మంచిర్యాల్, కాగజ్‌నగర్ మండలాల్లోని 25 చెరువులను పునరుద్ధరించనున్నారు. వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపూర్,

కొడకండ్ల, తొర్రూర్, ఆత్మకూర్, పరకాల మండలాల్లోని 22 చెరువులు, నిజామాబాద్ ఆత్మకూర్, పరకాల మండలాల్లోని 22 చెరువులు, నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి, మార్తాడ్, నందిపేట్, కమ్మరపల్లి, భీమ్‌గల్, బాల్కొండ, నిజాంసాగర్, మద్నూర్, పిట్లం, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, ధార్‌పల్లె మండలాల్లోని 34 చెరువులను తొలి విడతలో పునరుద్ధరించనున్నారు.

ఇక మెదక్ జిల్లా పరిధిలో జిన్నారం, కొండాపూర్, మునిపల్లి, సంగారెడ్డి, ఆందోల్, చేగుంట, మీర్‌దొడ్డి, తోగుట్ట, దౌల్తాబాద్, చిన్నకోడూర్, ఎల్దుర్తి, శివంపేట్, కుల్చారం, నర్సాపూర్, మెదక్, నంగనూర్, సిద్ధిపేట, దుబ్బాక మండలాల్లోని 64 చెరువులను పునరుద్ధరించనున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మేడ్చల్, కుత్బుల్లాపూర్, హయత్‌నగర్ మండలంలోని 44 చెరువులను పునరుద్ధరించనున్నారు.

No comments:

Post a Comment