-ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్...
-నీళ్లివ్వకపోతే ఓట్లడగం...
-ఇక్కడ ఇండ్రస్టీ పెట్టేవాళ్లే దేవుళ్లు
-వారికి అన్ని రకాలుగా సహకరిస్తాం
-చెరువుల పునరుద్ధరణలో విద్యార్థులు పాల్గొనాలి
-భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నర్సాపూర్/వెల్దుర్తి, జనవరి 7 (టీ మీడియా) : వచ్చే నాలుగేళ్లలో తెలంగాణ ప్రాంతంలోని మారుమూల గ్రామంలోని ప్రతి తాండాకు. ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు తాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. దేశంలోని ఏరాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఇంటికి నల్లాకనెక్షన్ ఇవ్వడం కోసం వాటర్‌గ్రిడ్ పథకం ప్రవేశపెట్టారని రాష్ట్రభారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నర్సాపూర్ సమీపంలోని పద్మశ్రీ బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన తెలంగాణ సంస్కృతి సంప్రదాయ దినోత్సవానికి హరీశ్‌రావు, జడ్పీచైర్ పర్సన్ రాజమణి మురళీయాదవ్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రతి ఇంటికీ నల్లాకనెక్షన్ ఇస్తే దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ అవుతుందని, నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ పథకం కింద తాగునీరు తాగించకపోతే వచ్చే ఎన్నికల్లో తాము ప్రజలను ఓట్లు అడగమని తేల్చిచెప్పారు.
తెలంగాణ ప్రాంతం లో ఇండస్ట్ట్రీలు పెట్టిన వాళ్లే మాకు దేవుళ్లని వారికి ప్రభుత్వం రెడ్‌కార్పేట్ పరిచి స్వాగతం పలికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన మిషన్‌కాకతీయ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని మిషన్‌కాకతీయ అంటే గత కాకతీయ రెడ్డిరాజుల పాలనలో పెద్దఎత్తున చెరువులు తవ్వించడం జరిగిందని అవి 60సంవత్సరాలుగా పునరుద్ధరణకు నోచుకోలేనందున ఈ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణను ఒక ఉద్యమంలా చేపట్ట డం జరిగిందని దీనికి మిషన్‌కాకతీయ అనే పేరుపెట్టినట్లు తెలిపారు. విద్యార్థులు చెరువుల పునరుద్ధరణలో పాల్గొంటే ప్రాక్టికల్‌గా అవగాహన వస్తుందని తెలిపారు. నర్సాపూర్ ప్రాంతంలో చాలా చెరువులు ఉన్నాయని ప్రతి విద్యార్థి చెరువు పునరుద్ధరణలో పాల్గొనాలని సూచించారు. హైదరాబాద్‌కు ఇంత దూరం లో బీవీఆర్‌ఐటీ ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉత్తమ కళాశాలగా పేరుగాంచిందని అన్నారు.
బీవీరాజు మారుమూల నర్సాపూర్‌లో కళాశాల ఏర్పాటు చేయడం జిల్లాలకే కాకుండా నర్సాపూర్‌కు గర్వకారణమని అన్నారు. ఆయన సామాజిక వేత్తగా పారిశ్రామిక వేత్తగా మంచి పేరు సంపాదించారని అన్నారు. సామాజిక సేవలో పద్మభూషన్ అవార్డు సంపాదించిన బీవీరాజు ఆశయ సాధనను నేడు ఆయన మనుమడు విష్ణురాజు కొనసాగిస్తున్నారని అన్నారు. ఇంజినీరింగ్ అంటే శ్రీచైతన్య, వాసవి అనే వాళ్లు ప్రస్తుతం బీవీరాజు అంటున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి సివిల్, అల్‌ఇండియా సర్వీస్, రైల్వేసర్వీస్‌లో తక్కువ మంది ఎంపికవుతున్నారని ఇక నుంచి చక్కగా చదివి దేశంలోనే ఉన్నతమైన ఆల్‌ఇండియా ఉద్యోగాలకు ఎంపికయ్యేవిధంగా విద్యార్థులు కష్టపడాలని సూచించారు. ఎండచూస్తే భయంగా ఉంది. మితో ఎన్నో విషయాలను మాట్లాడాలని ఉన్నప్పటికీ త్వరలో జరిగే కళాశాల వార్షికోత్పవంలో పాల్గొని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై పూర్తిస్థాయిలో వివరిస్తానని తెలిపారు.
తెలంగాణ ప్రాంతంలో త్వరలో బీవీఆర్‌ఐటీ డ్రీమ్డ్ యూనివర్శిటీగా ఏర్పాటు చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ పరంగా డ్రీమ్డ్ యూనివర్శిటీ ఏర్పడడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ మధ్యనే సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బీవీఆర్‌ఐటీకి నాలుగులైన్ల రోడ్డును మంజూరు చేశారు. ఇక్కడికి రావడానికి ప్రస్తుతం గంట సమయం పడుతుంది రోడ్డుపూర్తయితే 45నిమిషాలలో కళాశాలకు చేరేఅవకాశం ఉందని అన్నారు.
-హారీశ్‌రావుకు బిగ్‌ఫ్యాన్‌ను విష్ణురాజు
-అనంతరం విష్ణువిద్యాసంస్థల చైర్మన్ విష్ణురాజు మాట్లాడుతూ
ఫిల్మిస్టార్‌కు ఉన్నంత ఇమేజ్ మంత్రి హరీశ్‌రావుకు ఉన్నదని ఈ క్యాంపస్‌లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి హరీశ్‌రావేనని కొనియాడారు. ముఖ్యంగా మంత్రి హరీశ్‌రావుకు పెద్దఫ్యాన్ అన్నారు. ఈ ప్రాం తంలో మొట్టమొదటి సారిగా నల్లగొండలో సిమెంటు ఫ్యాక్టరీ పెట్టిన వ్యక్తి బీవీరాజు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీజీఎం కాంతారావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మురళీయాదవ్, కిషన్‌రెడ్డి, వీరేశం, అశోక్‌గౌడ్, హబీబ్‌ఖాన్, పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, మన్సూర్, నాయకులు భిక్షపతి, నాగేశ్, కృపాచారి, మజ్జులతో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-నెలాఖరు వరకు మిషన్ కాకతీయ పనులు ప్రారంభం
వెల్దుర్తి : చెరువులను పునరుద్ధ్దరణ చేసి పంట పొలాలను సస్యశ్యామలం చేసి రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులను ఈ నెలాఖరు వరకు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మండలంలోని మంగళపర్తి గ్రామంలోని మణికొండ రాఘవేంద్రరావు తల్లి మణికొండ జానకీదేవి గత నెల 30వ తేదీన మృతిచెందిం ది. రాఘవేంద్రరావును పరామర్శించడానికి బుధవారం మంగళపర్తికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. మిషన్ కాకతీయలో భాగం గా చెరువులను పునరుద్ధరణ చేసి నీటి నిలువ సామర్థ్యాన్ని పెం చి ఆయకట్టు చివరి పొలాలకు సైతం నీరు పారేలా చర్యలు తీసుకొని రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన అన్నారు.
ఈ పనులను ఈ నెలాఖరు వరకు ప్రారంభిస్తామని,ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని చెరువులకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పూర్తి స్థాయిలో టెండర్లు పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2 వేల కోట్ల రూపాయలను కేటాయించామని, అలాగే నాబార్డు ద్వారా రూ. 1400 కోట్ల రుణం కోసం బీపీఆర్‌లు పంపించామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ పథకం కోసం కూడా డపీఆర్‌లు తయారుచేసి నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 2,500 కోట్ల నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇవే కాకుండా జైకా, ప్రపంచ బ్యాంకు నిధుల కోసం కూడా ప్రతిపాదనలను తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ పథకం కోసం మెదక్ జిల్లాలో టెండర్ల ప్రక్రియ పూర్తైం ది. టెండర్లను కూడా పూర్తిగా పారదర్శకంగా ఆన్‌లైన్ విధానంలోనే. నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటాం, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా టెండర్ల ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు.
టెండర్లు పూర్తైన గ్రామాలలో సర్పంచులు, ఎంపీపీ, జడ్పీటీసీ, ప్రజాప్రనిధులంతా కలిసి గ్రామసభలు ఏర్పాటుచేసి రైతులను సమాయత్తం చేయాలని ఆయన సూచించారు. అలాగే వ్యవసాయ, ఇరిగేషన్, రెవిన్యూ శాఖలు, అధికారులు సమన్వంతో పనిచేసి ఆయా గ్రామాలలో రైతులను సన్నద్ధం చేసి పూడిక మట్టిని రైతుల పొలాల్లోకి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి వెంట రాష్ట్ర నాయకులు మరళీయాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు కోదండ కృష్ణాగౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, నర్సింహారెడ్డి, భూపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌లతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
Source: Namasthetelangana.com

No comments:
Post a Comment